బస్ పాస్ తీసుకున్న వారికి శుభవార్త

కరోనా కారణంగా ఐదు నెలలకు పైగా హైదరాబాద్ సిటీ బస్సులకు డిపోలకే పరిమితమయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ సేవలను త్వరగానే ప్రారంభించిన ప్రభుత్వం కరోనా కేసుల కారణంగా హైదరాబాద్‌లో మాత్రం ఆర్టీసీ సేవలను ఆలస్యంగా పునరుద్ధరించింది. తాజాగా హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లాక్‌డౌన్‌లో వినియోగించుకోలేని బస్ పాసులను తిరిగి ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. నవంబర్ 30లోపు పాత ఐడీకార్డు, టికెట్‌ను కౌంటర్‌లో సమర్పించి కొత్త పాస్ తీసుకోవాలని సూచించింది.