బర్త్డే స్పెషల్ : సచిన్ టెండూల్కర్ – గాడ్ ఆఫ్ ద క్రికెట్

సచిన్ టెండుల్కర్.. తన జీవితం ఎందరికో ఆదర్శం , పట్టుదలతో ప్రయత్నిస్తే అనుకున్నది సాధించడం కష్టం కాదని నిరూపించి అతి చిన్న వయసులో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు..! తన ఆటతో తన వ్యక్తిత్వంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను తన సొంతం చేసుకున్నారు.. సచిన్ టెండుల్కర్ రాకముందు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గొప్ప క్రికెటర్లు ఉన్న కానీ ప్రపంచ వ్యాప్తంగా అందరూ సచిన్ టెండుల్కర్ ని “గాడ్ ఆఫ్ ద క్రికెట్” గా భావిస్తారు.. అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ 47వ పుట్టినరోజు ఈరోజు.. ముందుగా మా కెన్టివి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ..!

సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ 24 1973న ముంబైలో సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు… !

1988 లో సచిన్ టెండుల్కర్ తన మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్ పై 15 సం.ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించిన ఘనతను తన సొంతం చేసుకున్నాడు…! అంతేకాకుండా సచిన్ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు… !

టెండుల్కర్ తన తొలి అంతర్జాతీయం టెస్ట్ క్రికెట్ మ్యాచ్ అతి చిన్న వయసులో ,1989లో పాకిస్తాన్ పై ఆడి కేవలం 15 పరుగులకే వకార్ యూనిస్ బౌలింగ్ లో అవుటయ్యాడు..!
అలాగే అదే సంవత్సరం డిసెంబర్ 18 న ఆడిన తన తొలి వన్డే మ్యాచ్ లో కూడా వకార్ యూనిస్ బౌలింగ్ లోనే డకౌట్ అయ్యాడు… !

అలాగే సచిన్ టెండూల్కర్ ,1990 ఆగష్టులో ఇంగ్లాండు లోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో తన తొలి శతకాన్ని సాధించాడు..! అలాగే తన ప్రతిభకు గుర్తింపుగా 1994 లో సచిన్ టెండూల్కర్ కి అర్జున అవార్డు ను అందజేశారు…! సచిన్ టెండూల్కర్ 1996 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్‌గా నిల్చాడు…ఆ ప్రపంచ కప్ లో 2 శతకాలు సాధించాడు..!

అదే సంవత్సరంలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా నాయకత్వ బాధ్యతలను అజహరుద్దీన్ నుంచి సచిన్ తెండుల్కర్ కు అప్పగించారు…కాని ఈ సీరీస్ లో ఆస్ట్రేలియా చేతిలో 3-0 తేడాతో ఓడిపోయింది. అలాగే అ తర్వాత 2-0 తేడాతో దక్షిణాఫ్రికాపై కూడా ఓడిపోవడంతో సచిన్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు… దాంతో అతని తర్వాత 2000లో సౌరవ్ గంగూలీకి కెప్టెన్సీ ని అప్పగించారు.

అలాగే 1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది అప్పట్లో ఈ అవార్డు స్వీకరించిన ఏకైక క్రికెటర్గా నిల్చాడు… !

1999 ప్రపంచ కప్ సమయంలో , తన తండ్రి చనిపోవడంతో తిరిగి దేశానికి వెళ్లడం వల్ల జింబాబ్వేతో మ్యాచ్ కి దూరమయ్యాడు కానీ నీ వెంటనే తిరిగి ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యా పై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసీ అ శతకాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చాడు.

2002 కు గాను విజ్డెన్ అత్యుత్తమ ప్రపంచ టెస్టు క్రికెటర్ల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్, వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది…! ఆ తర్వాత 2003లో విజ్డెన్ అచ్యుత మొదటిరోజు జాబితాలో వివియన్ రిచర్డ్స్ ను రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను అగ్రస్థానంలో నిలబెట్టారు..!

అలాగే ఇక వన్డేలో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు పైగా సాధించడాన్ని సచిన్ 7 సార్లు చేశాడు…! 1994, 1996, 1997, 1998, 2000, 2003, 2007 లలో ఈ ఘనత సాధించాడు…. ఇది ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఒక బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక పరుగుల రికార్డు… !

అలాగే డిసెంబర్ 19, 2010 న సెంచూరియన్ టెస్ట్ నాలుగవ రోజున ప్రత్యర్థి దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టేన్ బౌలింగ్లో సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మొదటిసారి 50 సెంచరిలు పూర్తి చేసిన ఆటగాడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు… ! అలాగే వన్డే క్రికెట్లో 49 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు..! ఆ తర్వాత బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్లో 100 పరుగులు చేసి , అన్ని ఫార్మాట్లలో కలిపి వంద సెంచరీలు పూర్తి చేసి చరిత్రను సృష్టించాడు..! అలాగే నవంబర్ 16 ,2013 న తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి..అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకుంటున్న అదే సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన “భారత రత్నను” సచిన్ కు ప్రకటించింది.

సచిన్ టెండుల్కర్ ఇప్పటిదాకా 198 టెస్ట్ మ్యాచ్లు ఆడి 15,837 పరుగులు సాధించాడు , అలాగే 463 వన్డే మ్యాచులు ఆడి 18,426 పరుగులు సాధించాడు ..!