జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఒక్క అవకాశం ఇవ్వండి -గునుకుల కిషోర్
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ అధ్యక్షులు కంతర్ సమక్షంలో 50 మంది ముస్లిం మైనారిటీలు స్వచ్ఛందంగా పార్టీ లో చేరడానికి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా వారికి వి ఆర్ సి గ్రౌండ్లో పార్టీ కండువాలు వేసి ఆదివారం జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ చేస్తున్న, చేయబోయే కార్యక్రమాలను వివరించడం జరిగింది తదనంతరం రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కి పూలమాల వేసి ర్యాలీగా జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంటుందో,ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ పోకడలను, ధౌర్జన్యాలను ప్రజలకు తెలియజేస్తూ వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.ఈ కార్యక్రమంలో జనసేన టీంపూసలమల్లేశ్వరరావు, అలేఖ్,రాజా, కందర్,అమీన్,మనీషా,హేమంత్, సుబ్బు, హరి,మౌనిష్,వర,బన్నీ తదితర జన సైనికులు పాల్గొన్నారు.