జగిత్యాల లో ఘోరం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా కొంత మంది దుర్మార్గులు దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నారు.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై దాడులు జరగకుండా తాజాగా..జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం చేసారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  అత్యాచారం చేస్తుండగా ఆ వీడియో తీశారు సదరు నిందితులు. అంతేకాదు వీడియో సోషల్ మీడియాలో  పెట్టి వైరల్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బాలిక బంధువుల పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల ఆ ఐదుగురు నిందితులు అదుపులో ఉన్నారు.