గుండెపోటుతో కన్నుమూసిన ఘంటసాల తనయుడు.

ప్రముఖ సినీ గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ ఈరోజు ఉదయం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తీవ్ర గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల కిందట ఆయనకు కరోనా నుండి కోలుకున్నారు. ముందు నుండే దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత సమస్యలతో రత్నకుమార్‌ బాధపడుతున్నారు. దీంతో ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్‌పై ఉన్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఘంటసాల రత్నకుమార్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో వెయ్యికిపైగా చిత్రాలకు డబ్బింగ్‌ చెప్పారు.