ఆసియా అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ

ఆసియా అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ రికార్డులకెక్కారు. అంబానీ కంపెనీల షేర్లు తగ్గడం.. అదానీ కంపెనీల షేర్లు పెరగడంతో సంపదతో తేడా వచ్చేసింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీకి సౌదీ అరామ్‌కో డీల్ తేడా కొట్టడంతో వెనుకబడిపోయారు. మరో వైపు గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు పరుగులుపెడుతున్నా యి. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకున్న బ్లూమ్‌బెర్గ్ లెక్కల ప్రకారం ఇప్పుడు ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీనే. రిలయన్స్ అంటే ప్రజా జీవితాల్లో ఉంది. ఆ సంస్థ ఎన్నో దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉంది.కానీ అదానీ ఎప్పుడొ చ్చారు..? ఏం వ్యాపారం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ , అదానీ పోర్ట్స్ , అదానీ ట్రాన్సుమిషన్ , అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ పేర్లతో ఉన్న కంపెనీల ద్వారానే ఆయన అత్యంత కుబేరునిగా ఎదిగారు. పోర్టుల్ని ఎడా పెడా కొనేయడం విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం.. వంటి వాటి ద్వారా ఆయన షేర్ల విలువను పెంచుకుటున్నారు. దాని ద్వారా కుబేరుడయ్యారు. ఇటీవల అదానీ కంపెనీలకు ఇతర దేశాల నుంచి వస్తున్న పెట్టుబడులకు సరైన లెక్కలు లేవన్న ప్రచారం జరిగింది. వివరాలు సెబీకి ఇవ్వడం లేదన్న విషయం బయటకు వచ్చింది. అప్పట్లో అదానీ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. కానీ ఇప్పుడు కోలుకున్నాయి. ఆయనను నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాయి. ఆ పెట్టుబడులకు లెక్కలున్నాయో లేదో ఎవరూ చెప్పడం లేదు.