తరచూ విద్యుత్ అంతరాయం ఇబ్బందుల్లో ప్రజలు.

మండల కేంద్రమైన చిట్వేల్ లో విద్యుత్ అధికారుల పని తీరు మరీ అధ్వానంగా ఉంటుంది .తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతూ ఉండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గత వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఉంటుందని ప్రజలు వాపోతున్నారు విద్యుత్ సరఫరాలో అంతరాయం పై విద్యుత్ అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉండడం తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి. సంబంధిత అధికారులు విద్యుత్ అంతరాయం పై ముందస్తు సమాచారం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.