కాపు నేస్తం కాదు కాపు ద్రోహం : మాజీ ఎమ్మెల్యే

కాపు నేస్తం కాదు కాపు ద్రోహం అని రిజర్వేషన్లు రద్దు చేసికాపులనుఉద్దరించడమా అని వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. YSR కాపు నేస్తం పేరుతో కాపు మహిళలకు ఏటా రూ 15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ 75వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్లు జగన్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారన్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో కోటిన్నర మంది కాపు జనాభా ఉన్నట్లు పేర్కొన్న జగన్ రెడ్డి కాపు నేస్తం పథకాన్ని కేవలం 2.35 లక్షల మందికి పరిమితం చేసి కావులను వంచించారన్నారు. వైసిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికారంలోకి వస్తే ప్రతి BC, SC, ST, మైనారిటీ, కాపు మహిళలకు 45 ఏళ్లకె రూ 3వేల చొప్పున పెన్షన్ ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో 45 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి 75 వేల రూపాయలు ఇస్తామని ఇప్పుడు కులాల వారి విభజించి అర్హుల సంఖ్యను కుదించి మోసం చేస్తున్నారన్నారు. తొలి ఏడాది లబ్ధిదారుల్లో లక్ష మంది లబ్దిదారుల్ని కొత్తగా గుర్తించామని కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ జక్కంపూడి రాజా స్వయంగా ప్రకటించారన్నారు.

ఆధార్, రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని నాడు ప్రకటించి ఈరోజు ఆదాయ ధ్రువీకరణ, 6నెలల విద్యుత్ బిల్లు వంటివి అడిగి లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు, ఇది ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమన్నారు. కాపులకు టిడిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు రద్దు చేయడం ద్వారా విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలను దూరం చేసి కాపుల గొంతు కోసింది మీరు కాదా అని ప్రశ్నించారు. కాపులకు 2 వేల కోట్లతో బడ్జెట్ ప్రకటించి డబ్బు మొత్తాన్ని మళ్లించి ఇప్పుడు కాపు నేస్తం పేరుతో హడావుడి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం హయాంలోనే కాపు అభ్యున్నతి జరిగిందని గుర్తు చేశారు. ఒక సామాజిక వర్గానికి BC రిజర్వేషన్లు కల్పించాలి అంటే ముందుగా రాష్ట్ర స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలి అనే నిబంధన ప్రకారం సుప్రీం కోర్టు ఆదేశాలను తు. చ తప్పకుండా అమలు చేసి కాపులకు BC రిజర్వేషన్ కల్పించామన్నారు. కాపులకు శాశ్వత ప్రయోజనం కల్పించడం కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 3100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. NTR విదేశీ విద్యాదరణ పథకం ద్వారా 4528 మంది విద్యార్థులకు NTR ఉన్నత విద్యా పథకం ద్వారా 29 కోట్ల రూపాయలతో 1413 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చామన్నారు.

కాపులకు రిజర్వేషన్ అంశాన్ని పార్లమెంట్ సాక్షిగా మోడీ ని ప్రశ్నించాల్సి వస్తుందని దొంగ రాజీనామాలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ కేంద్ర పరిధిలోని అంశమని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు రద్దు చేశారన్నారు. ఉన్న రిజర్వేషన్లు ఎత్తేసి కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నారన్నారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కంచాలపై గరిటలతో మోగించి రాద్దాంతం చేసిన రిజర్వేషన్లు సమితి ఏమైంది? టిడిపి కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేసిన కూడా సాధన సమితి సభ్యులు నిద్రపోతున్నారా అని వాపోయారు. రిజర్వేషన్ల పేరుతో యువతను రెచ్చ గొట్టి రైళ్లు తగలబెట్టి కాపు యువతను సంఘ విద్రోహ శక్తులుగా జగన్ రెడ్డి చిత్రీకరించారన్నారు. జగన్ రెడ్డి పాలన అంత వంచన, మోసం, ద్రోహం అనడానికి కాపు రిజర్వేషన్లు రద్దే ప్రత్యేక్ష నిదర్శనమన్నారు.