తెలుగుమహిళా కార్యకర్తలును సన్మానించిన.. మాజీమంత్రి గొల్లపల్లి

రాజోలు మండలం ,తాటిపాక గ్రామంలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు మరియు సూర్యారావు గారి సతీమణి లూథియమ్మ  ఇరువురు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా లూథియమ్మ కేక్ కట్ చేసి అందరికీ పంచి మాజీమంత్రి గొల్లపల్లి దంపతులు రాజోలు నియోజకవర్గ తెలుగు మహిళా నాయకురాళ్లు సుమారు నలబై మందిని దుశ్శాలువాలు కప్పి సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, మహిళా నాయకురాళ్లు అంతా కలసి లూథియమ్మని ఘనంగా సన్మానించారు, ఈ రోజు అమరావతి మహిళా రైతులు దుర్గమ్మను ను దర్శించుకోవటాని వెళుతుంటే పోలీస్ వారిచే అరెస్ట్ చేయించి జీప్ లు ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారంటే మహిళా దినోత్సవం రోజున కూడా ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, మహిళలకు ఈ రాష్ట్రంలో స్వతత్రం లేదని అర్థం అవుతుంది ప్రజలు ఓపికతో సహనం తో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని మాజీమంత్రి గొల్లపల్లి అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మంగెన భూదేవి, రాజోలు మండల తెలుగుమహిళా అద్యక్షురాలు చెల్లింగి జాంబవతి,మల్కిపురం మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు బందెల పద్మ, కసుకుర్తి శ్రీలక్ష్మి, మోకా పార్వతి, కాకి లక్ష్మీ దేవి, మట్టపర్తి లక్ష్మీ, గెడ్డం పద్మ కుమారి, కడలి రామా దేవి, కొత్తపల్లి విజయలక్ష్మి, రావి ఆదిలక్ష్మి, పితాని మంగ తాయారు, కడలి నాగవేని,కటికరెడ్డి నాగేశ్వరి, యాలంగి విజయలక్ష్మి, వీరా మంగతయారు,బళ్ల సుజాత, కమిడి శాంతి, అడబాల రామా దేవి, చెల్లుబోయిన హెలినా,వీర కర్ణుడు, రాపాక అరుణకుమారి, కడలి దుర్గాదేవి, కోట పుష్పకుమారి,కసుకుర్తి త్రినాధస్వామి, చాగంటి స్వామి, అడబాల యుగంధర్, రాపాక నవరత్నం, బాలాజీ వేమా, రావి మురళీకృష్ణ, పితాని సూరిబాబు, చిట్టూరి సంతోష్, చెల్లింగి శ్రీనివాస్, చెల్లింగి జనకిరమయ్య,కటికరెడ్డి నాగేశ్వరావు, అయినివిల్లి ఏడుకొండలు, కామిడి పద్మాకర్, బళ్ల బాబ్జి,పితాని భాస్కర్, కడలి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు