శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా చేరుకుంటున్న వరద

ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు అధిక మొత్తంలో వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లోతో జలాశయం నిండుకుండలా మారింది. జురాల ప్రాజెక్ట్‌ నుంచి 17,264 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 3,309 క్యూసెక్కుల ప్రాజెక్టులోకి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 809.02 అడుగులు మేర నీరుంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.8613 టీఎంసీల నీరుంది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి ప్రస్తుతం నిలిచిపోయింది.