తూ. గో.జిల్లా లో ప్రేవేట్ ఆస్పత్రులకు భారీ జరిమానా

కాకినాడ: కోవిడ్ చికిత్స కోసం 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ ఈ.హెచ్.ఎస్ పధకాల క్రింద నగదు రహిత చికిత్సకు కేటాయించక పోవడం, నిర్థేశించిన రేట్లకు మించి ఫీజులు వసూలు చేయడం, నిబంధనల ఉల్లంఘకు పాల్పడడం ఇతర కారణాలపై 39 కోవిడ్ నోటిఫైడ్ ప్రయివేట్ ఆసుపతులకు భారీ జరిమానా కోటీ 54 లక్షల మేరకు పెనాలిటీ విధిస్తూ జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఉత్తర్వులు జారీ విజిలెన్స్ అధికారులు, క్లస్టర్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ లు నిర్వహించిన తనిఖీలలో జిల్లాలో కోవిడ్ చికిత్సకు నోటిఫై చేసిన 39 ప్రయివేట్ ఆసుపత్రుల బాగోతం బట్టబయలు.

ఒక్కో ఆస్పత్రికి 2 లక్షల నుండి 10 లక్షల వరకూ పెనాలిటీలు చొప్పున మొత్తం కోటీ 54 లక్షల పెనాటీలు విధించామని తెలిపిన జిల్లా కలెక్టర్.  ఫైన్ మొత్తాన్ని ఆయా ప్రేవేట్ ఆసుపత్రులు 48 గంటలలోపు ఆరోగ్యశీ అకౌంటుకు చెల్లించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. ప్రవేట్ ఆస్పత్రులు పద్దతి మార్చు కోకుండా అక్రమాలకు పాల్పిడితే ఆసుపత్రులను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సిబ్బందితో నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర రెడ్డి.