భారత్ వేదిక జరగాల్సిన ఫిఫా వరల్డ్ కప్ వచ్చే ఏడాది వాయిదా..!

భారత దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో మరో క్రీడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ సంవత్సరం భారత్ వేదికగా జరగాల్సిన అంతర్జాతీయ అండర్-17 ఫిఫా వరల్డ్ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 కి వాయిదా వేస్తున్నట్టు ఈరోజు ఫిఫా నిర్ణయం తీసుకుంది.

ముందు షెడ్యూల్ ప్రకారం ఈ సంవత్సరం నవంబర్ 2 నుంచి 21 దాకా జరగాల్సి ఉంది, కానీ కరోనా ప్రభావంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు వాయిదా వేశారు. అలాగే ముందు విధించిన నియమాల ప్రకారమే 2003 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 2005 లోపు జన్మించినవారే ఈ టోర్నమెంట్ కు అర్హత సాధిస్తారు అని ఫిఫా మరోసారి స్పష్టం చేసింది.

అలాగే దేశంలో కోల్కత్తా, గువాహతి, భువనేశ్వర్, అహ్మదాబాద్, నవీ ముంబైల వేదికగా ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తాము అన్నారు.