మాస్ మహారాజ్ తో జతకట్టనున్న జాతిరత్నాలు బ్యూటీ
‘జాతిరత్నాలు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఫరియా అబ్దుల్లా బంపర్ ఆఫర్ కైవసం చేసుకుంది. మాస్ మహారాజ్ రవితేజ చిత్రంలో ఆమెకు ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం వినవస్తోంది. ప్రస్తుతం రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్న రవితేజ.. తన తర్వాతి సినిమాను త్రినాథ రావు దర్శకత్వంలో చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాని హీరోయిన్‌గా తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఫరియా తన నటనతో ప్రేక్షకులను అమితంగా అలరించింది.