విచారణ చేస్తే నిజాలు బయట పడతాయనే అభద్రతా భావంతో అసత్య ప్రచారాలు

శాంతియుతంగా నిరసన తెలుపుతన్న తమపై పోలీసులు దాడి చేశారని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. 2009లో జొన్నలగడ్డలో దివంగత నేత ప్రియతమ నాయకుడు డా. వైఎస్ఆర్ విగ్రహ ఏర్పాటు చేసిన విషయాన్ని పునరుద్ఘాటించారు. నల్లపటి చంద్ర శేఖర్ కూడా అప్పుడు తమతో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు లేనప్పుడు పిరుకిపందల్లా కొందరు దుండగులు వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని తొలగించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయాన్ని తెలిపారు. 20 మందిని అనుమానితులుగా పెర్కొంటే సీసీటీవి ఫుటేజ్ ఆధారంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దీనిపై అరవిందబాబు గారు ఇవాళ సాయంత్రం ధర్నా చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. విచారణ కోసం అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు విచారణ చేయకూడదా అని నిలదీశారు. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని ఉదయం టీడీపీ నేతలు, లాయర్లు స్టేషన్లకి వెళ్తే పోలీసులు కూడా వారికి వివరంగా ప్రతి విషయాన్ని తెలిపారని అన్నారు.

15 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న నరసరావుపేటను పండుగ వేళ చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ గారి విగ్రహానికి గీత కూడా పడకుండా వైఎస్ఆర్ గారి విగ్రహన్ని తొలగించడం చాలా బాధ కలిగించిందని అన్నారు. వైఎస్ఆర్ తమకు దేవుడని అభివర్ణించాడు. మనిషిగా చనిపోయినా పేదవారి గుండెల్లో దేవుడిగా కొలువైన వ్యక్తి వైఎస్ఆర్ గారని అన్నారు. పోలీసుల విచారణ చేస్తే నిజాలు బయటపడతాయనే అభద్రతా భావంతో ఇవాళ టీడీపీ నేతలు దర్నాలకు దిగుతున్నారని విమర్శించారు. పండుగ వేళ ప్రయాణికుల ఇబ్బందులను కూడా పట్టించుకోకుండా జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా గోల చేశారని, జొన్నలగడ్డ నుంచి అరవింద బాబుని తరలించే ప్రయత్నం పోలీసులు చేయగా దొంగ నాటకం మొదలు పెట్టారని అన్నారు. పోలీసులు తన్నడం వల్ల స్పృహ తప్పారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలీసులు తన్నిన వీడియో ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జొన్నలగడ్డ నుంచి వివేకానంద హాస్పిటల్ వెళ్ళే వరకు సాగిన హైడ్రామా సరిగ్గా హిట్ కాలేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అందుకే వివేకానంద హాస్పటల్ లో బెడ్ మీద పడుకొని సింపతీ కోసం ఆరాటపడుతున్నారని అన్నారు. ఈసిజి రిపోర్ట్ లలో నార్మల్ గానే ఆరోగ్య పరిస్థితి ఉందని అది కూడా తెలుసుకోకుండా జీవీ అంజనేయులు లాంటి వ్యక్తులు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

చంద్రబాబు మాచర్ల పర్యటన నేపథ్యంలో బాబు కాన్వాయ్ అరవింద్ బాబు కాలు మీదకు ఎక్కిందంటు ప్రచారం చేసిన పచ్చ పార్టీ నేతలు. అరవింద బాబు కొద్దిసేపటికే చంద్రయ్య పాడే ఎలా మోశారని నిలదీశారు.నల్లపాటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తిపై నాడు దాడి జరిగితే కాపాడింది వైసీపీ అన్నారు. నాడు కేబుల్ టీవీపై దాడి చేస్తే తమ కారు అద్దాలు సైతం పగిలినా వెనక్కి తగ్గకుండా నిలబడ్డామని నాటి పరిస్థితులను వివరించారు. చంద్రబాబు నాయుడితో పాటు అరవింద బాబు, ఆయన అనుచర గణం పన్నే కుయూక్తులు ఇక్కడ చెల్లవని హెచ్చరించారు. పల్నాడులో చిచ్చులు పెట్టి లబ్ధి పొందాలని చూస్తే ఎంతటి వారినైనా వదిలేదని లేదని హెచ్చరించారు