మోర్ ఫన్ అన్నదానికి సంకేతమే ఎఫ్3 : అనిల్ రావిపూడి
సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకొని తన సక్సెస్ పరంపరను కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి, తన తర్వాతి సినిమా ఎఫ్3 గురించి చాలా ఆసక్తి రేపించే విషయాలు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు..!
మోర్ ఫన్ అన్నదానికి సంకేతమే మూడో ఎఫ్ అంటున్నారు .. ఎఫ్2 నచ్చిన వాళ్ళు మరింత ఆస్వాదించేలాగా ఎఫ్3 ఉంటుంది అన్నారు..! అలాగే హిందీ గోల్ మాల్ , హౌస్ ఫుల్ చిత్రాల తరహా ఫ్రాంచైజీ ని తెలుగులో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు..! ఎఫ్ 2 లో ఉన్న పాత్రలే ఎఫ్ 3 లో కూడా ఉంటాయి అని అన్నారు.. !
ఈసారి మరింత మంచి థీమ్ దొరికింది అని , దానికి మరిన్ని విభిన్నమైన అంశాల్ని మరింత మజా ని జోడించి మీ ముందుకు తీసుకు వస్తాము అన్నారు… ! అలాగే ఈ చిత్రంలో మూడో కథానాయకుడు ఉండే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు… ఈ కథలో మరో కథానాయకుడుకి చోటు ఉండే అవకాశం కనబడడం లేదు.. ఒకవేళ ద్వితీయార్థంలో లో ఏమైనా అవకాశం ఉంటే ఆలోచిస్తాం అని ఆయన అన్నారు.!