ఎమ్మిగనూరులో ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ల పంపిణి

ఎమ్మిగనూరు పట్టణంలోని 11వ వార్డులో 8 కొత్త పింఛన్లు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీకి సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని, టీడీపీ హయాంలో అర్హత ఉన్నప్పటికీ ఆ పార్టీ నాయకులు చెప్పిన వారికే పింఛన్లు ఇచ్చేవారని, కానీ నేడు కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ పింఛన్లు ప్రతి నెలా ఒకటవ తేదీనే ఇంటికొచ్చి మరీ అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేశన్న, మున్సిపల్ వైస్ చైర్మన్, 11వ వార్డు కౌన్సిలర్ డి. నజీర్ ఆహ్మద్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఫించన్ దారులు తదితరులు పాల్గొన్నారు.