ఎలివేటర్-ఎలిసా గ్రేవ్స్ ఓటిస్ దాయి శ్రీశైలం

రెండు మెట్లు ఎక్కగానే… ‘అబ్బో మనవల్ల కాదుగానీ లిఫ్ట్ ఉందేమో చూడు’ అనే రోజులు ఇవి. మెట్రో రైల్ దగ్గరే తీసుకుందాం. వృద్ధులకు వికలాంగుల
కోసం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్లాట్‌ఫారమ్ వరకు లిఫ్ట్ ఏర్పాటు చేశారు. కానీ మనమేం చేస్తాం? వాళ్ల కంటే ముందే లిఫ్ట్’కి చొచ్చుకెళ్లి హాయిగా పైకి కిందికి వెళ్తుంటాం. ఇంతవరకు బాగానే ఉందిగానీ.. మన కింతటి సౌఖర్యాన్ని కల్పించిన ఆ లిఫ్ట్ నేపథ్యమేంటో తెలుసుకోవాలని లేదా? ఐతే ఇది చదవండి.
ఫ్ట్ లేకుండా సాఫీగా బతకడం ఇప్పుడు చాలా కష్టం. ఒక్క ఫ్లోర్ కే మెట్లెక్కి పోలేం. ఇంకా ఐదారు ఫ్లోర్లు అంటే వీలవుతుందా? ఇల్లు.. ఆఫీసు.. షాపింగ్ మాల్.. ఇలా అన్నింట్లోనూ ఎలివేటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇంత అవకాశం ఉన్నాక మనం మెట్లనెందుకు వాడుతాం చెప్పండి? మనకు అంతో ఇంతో మెట్లు ఎక్కే అవకా శమైనా దొరికింది. కానీ తర్వాతి తరానికి అసలు మెట్లు ఎక్కడమంటే ఏంటో కూడా తెలియనంతగా మార్చేస్తుంది టెక్నాలజీ. పెరుగుతున్న జనాభా.. మారుతున్న అవ సరాలు.. విస్తరిస్తున్న టెక్నాలజీ మూలంగా ఎలివేటర్ లాంటి సౌకర్యాల్లో ఇంకా ఇంకా మార్పులెన్నో వచ్చే అవకా శాలు లేకపోలేదు.
పురాతన కట్టడాలు.. మందిరాలు.. కోట గోడలు చూస్తే ఏమనిపిస్తుంది? అబ్బా.. ఇంత పెద్ద పెద్ద రాళ్లు అంత పైకి ఎట్లా ఎత్తి ఉండొచ్చు? అనే అనుమానం వస్తుంది కదా? బలమైన ఏనుగులు.. గుర్రాల సహాయం తీసుకున్నారే అనుకుందాం. కానీ.. ఎన్నేం డ్లని వెచ్చిస్తారు. సమయం ఆదా అవ్వాలి.. శ్రమ తగ్గాలి.. పనిలో నాణ్యత ఉండాలి

అంటే యాంత్రిక ప్రత్యామ్నాయమేదో రావాలి కదా? ఆ ప్రత్యామ్నాయమే ఎలి వేటర్. అలా సునాయసంగా బరువులు ఎత్తడానికి కనుగొనబడిన ఎలివేటర్ ఇప్పుడు శ్రమను తగ్గిస్తూ.. సమయాన్ని ఆదా చేస్తూ అతి సునాయసంగా గమ్యం చేరుకునే అవకాశం కల్పిస్తున్నది. దీనికం తటికీ కారణం ఎలిసా గ్రేవ్స్ ఓటిస్. ఈయనే ఎలివేటర్ రూపకర్త. ఏ పని సరిగ్గా చేయని ఎలిషా ఎందుకు ఎలివేట రను కనుగొన్నాడు? దాని వెనక ఉన్న కార ణమేంటి?అది అమెరికాలోని వెర్మాంట్.. ఇంగ్లండ్ నుంచి వందలాది కుటుంబాలు వలస వచ్చాయి. అలాంటివారిలో స్టీఫెన్ ఓటిస్, ఫోయెబ్ గ్లయిన్ జంట కూడా ఉంది. ఏ ఒక్క చోటా స్థిరంగా ఉండక దేశ దేశాలు తిరుగుతూ ఆఖరికి వెర్మాంలో తాత్కాలికంగా ఉండిపోయిన కుటుంబం వీరిది. వీరికి ఆరుగురు పిల్లలు. 1811లో ఆరో సంతానంగా ఎలిసా గ్రేవ్స్ ఓటిస్ పుట్టాడు. చిన్నప్పటి నుంచి బద్దక స్తుడు. ఏపనీ సక్రమంగా చేయడు. మైండ్ ఆబ్సెండ్ బాడీ ప్రజెంట్ అన్నట్టు ఉండేది ఎలిసా ప్రవర్తన. పేరెంట్స్ ఏది చెప్పినా.. ఏదో చెప్పార్లే అనేలా ప్రతీది చాలా తేలికగా తీసుకునే వాడు. కానీ చదువులో మాత్రం బాగానే రాణించే వాడు. అయితే చదువొక్కటే ప్రపంచంగా బతకలేదు. చిన్నప్పటి నుంచి వినూత్నంగా ఆలోచిస్తుండేవాడు. ఏదైనా వస్తువు దొరి కితే దీనిని ఎలా తయారుచేశారు? ఇది ఇలా ఎలా సాధ్యం అవుతుంది? అని రక రకాలుగా ఆలోచించి అసలు విషయంపై కాకుండా ఇతర విషయాలపై ఆసక్తి కనబ ర్చేవాడు. కొందరికి ఇది

ప్రత్యేక నైపుణ్యంగా అనిపిస్తే కొందరికి పనికిమాలిన చర్యగా అని పించేది. బయటి వాళ్లకేమోగానీ తల్లిదండ్రులకు ఎలిసాప్రవర్తన అంతగా నచ్చేది కాదు. ఎప్పుడూ చీవాట్లు పడు తుండేవి. వాళ్లెంత మొత్తుకున్నా అతడు పెడచెవిన పెడుతూ ఉండేవాడు. పరిస్థితి ఇలా ఉంది. ఏం చేస్తారు? చెప్పి చెప్పి అలసిపోయారు. నీ ఇష్టం.. ఎలా ఉంటే అలా ఉండు.. ఏం చేసుకుంటే అది చేసుకో అన్న తీవ్రస్థాయికి వచ్చింది ఎలిసా ప్రవర్తన. ఎలిసాకు 20 సంవత్సరాలు. అతడిని అమ్మానాన్నలు సరిగా అర్థం చేసుకోలేదు అనేది అతడి భావన. దగ్గరే ఉంటూ వారిని ఇబ్బంది పెట్టడం.. తానూ ఇబ్బంది పడటం ఎందుకని ఇల్లు విడిచి పారిపో యాడు. అప్పటివరకైతే బయటకొచ్చేశాడు కానీ.. ఏమీ తోయడం లేదు. ఎవరైనా చుట్టాల దగ్గరికి వెళ్లామంటే వాళ్ల చుట్టాలందరూ లండన్లోనే ఉన్నారు. ఇక్కడ అంతా కొత్త.. అందరూ కొత్తవాళ్లే. నడుచుకుంటూ వందల కిలోమీటర్లు వెళ్లాడు. కూలీ పని చేసేవాళ్లు.. రైతులు.. భవన నిర్మాణ కార్మికులు ఇలా ఎందరి కష్టాన్నో కళ్లారా చూశాడు. అతడికొక కనువిప్పు కలిగింది. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఉండాల్సింది కాదు అనుకున్నాడు. కానీ ఇప్పటికిప్పుడు మళ్లీ ఇంటికి వెళ్లాద్దని గట్టిగా నిర్ణ యించుకున్నాడు. అది న్యూయార్క్, ఎందుకో అక్కడే ఉండిపోవాలనిపించింది ఎలిసాకు. చాలా నచ్చేసింది ఆ ప్రాంతం. ఒక రోజు.. రెండ్రోజులు. నెలలు. ఇలా గడిచిపోయాయి. ఏదో రకంగా పూట గడు స్తుంది. కానీ శాశ్వతంగా ఏదైనా పని చూసుకోవాలి అను కున్నాడు. మొదట్లో బరువులు మోసే వాహనానికి చోద కుడిగా పనిచేశాడు. కానీ దాంట్లో ఎక్కువకాలం ఉండలే కపోయాడు. తర్వాత వడ్రంగి పనిలో చేరాడు.ఆ పని నచ్చింది.

కానీ పనిచేసే ప్రదేశం నచ్చలేదు. సరిగా తినక పోవడం సరిగా నిద్రపోకపోవడం భవిష్యత్ గురించి రోజంతా ఆలోచిస్తుండడం వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నది. ఇప్పుడు తప్పనిసరిగా న్యూయార్క్ విడిచి వెళ్లాల్సిందే 1835. ఎలిసా మకాం బాటిల్ బోరోకు మార్చాడు. కొద్దిరోజులకే ఆరోగ్యం కుదుటపడింది. అక్కడ కొంతమంది పరి చయం అయ్యారు. వారి సహకారంతో ‘చెక్క మిల్లు ప్రారంభించాడు. స్థానికుడు కాకపోవడంతో కలప లభ్యత సరిగ్గా ఉండేది కాదు. దీంతో వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. కొద్దిరోజులకే దుకాణం ఎత్తేశాడు. ఏదో ఒకటి చేయాలి కదా? “ధాన్యం మిల్లు’ ప్రారంభించాడు. దాంట్లోనూ అదే పరి స్థితి ఎదురైంది. ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు. అయినా చెప్పుకోవడానికంటూ ఎవరున్నారు? అనే ఆత్మ న్యూనత. లాభం లేదనుకున్నాడు. ఈ దుకాణమూ ఎత్తేశాడు. మళ్లీ వడ్రంగి పనివైపే మొగ్గు చూపాడు. 1845 వరకు అక్కడే ఉండి కార్పెంటర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎలిసా వయసు 34 సంవత్సరాలు. కార్పెంటింగ్ లో మంచి పట్టు సంపాదించాడు. ఇప్పుడు అతడికి జీవితంపై స్పష్టమైన అవగాహన ఏర్పడింది. ఏం చేయాలి అనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దని మళలీ న్యూయార్క్ కి వెళ్లాడు. ఇక అక్కడే స్థిరంగా ఉండిపోవాలనుకున్నాడు. మళ్లీ వ్యాపారంలోకి వచ్చి మంచాలు, గృహోపకరణాలు తయారుచేసే ఫ్యాక్టరీ ప్రారంభించాడు. నాణ్యమైన.. కళా త్మకమైన ప్రోడక్ట్ మాత్రమే ఇవ్వాలనేది అతడి ఆలోచన. అనుకున్నట్లుగానే అతి త్వరలో అతడి ఉత్పత్తులు ప్రజ లోకి వెళ్లాయి. రోజూ పదుల సంఖ్యలో ఆర్డర్లు వస్తుం డేవి. 1852లో న్యూయార్క్ లో ఒక కంపెనీని లీజ్ కు తీసుకు న్నాడు.

దానిని ఆధునీకరించాలని నిర్ణయించుకున్నాడు. కొత్త ఫర్నీచర్ కొత్త మంచాలు ఇతర సదుపాయాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నాడు. నెలరోజులైంది. అడ్వాన్స్ భారీగానే ఇచ్చాడు. ఏమీ సంపాదించకుండానే నెల రోజులు గడవడంతో పనిని వేగవంతం చేయాలి అనుకున్నాడు ఎలిసా.ఎందుకు ఆలస్యం అవుతుంది?అని పనివాళ్లను అడి గితే పెద్ద పెద్ద వస్తువులను పైకి ఎత్తడంలో ఆలస్యం అవు తుంది అని వాళ్లు చెప్పారు. ఇంకా వారి శ్రమను చూసి చలించిపోయాడు. పాపం ఇంతలా కష్టపడుతున్నారు వీరి శ్రమను తగ్గించడానికి యంత్ర సహాయంతో వస్తు వులను పైకెత్తే సాధనం తయారు చేయలేమా? అనే ఆలో చనలోంచి పుట్టుకొచ్చిందే ఎలివేటర్. కానీ ఎలా తయారుచేయాలి? అనేక భౌతిక స్థితి చలన పద్ధతలను అధ్యయనం చేశాడు. ఇంధన సహాయంతో నడిచే మోటార్ల పనితీరును పరిశీలించాడు.పై నుంచి కిందికి రావాలంటే ఎలాంటి ఫార్ములా ప్రయో గించాలి? కింది నుంచి పైకి వెళ్లాలంటే ఎలాంటి ఫార్ములా ప్రయోగించాలి? అని పుస్తకాలు చదివి తెలు సుకున్నాడు. కార్పెంటగా చలామణిలో ఉన్న ఎలిసా శాస్త్రవేత్త స్థాయిలో ఆలోచించడం మొదలుపె టాడు. రోజూ ఉదయాన్నే లేవడం ఏదో ఒక పరికరం ముంద రేసుకోవడం ప్రయోగాలు చేయడం ఇదే అతని దిన చర్య. అతడి ప్రతిభకు పదును పెరిగింది. కొత్త కొత్త పరి కరాలు చాలా తయారుచేశాడు.తొలి ప్రయోగం గొడ్డలి తాడు దండెం సిద్ధం చేసుకున్నాడు.ఒక పీట తీసుకొని దానికి తాళ్లను కట్టాడు. ప్రతీ పీటకు రెండు వరుసల తాడును కట్టి ఒక వరుసను సాధారణ ఎత్తులో ఇంకో వరసున దానికి రెట్టింపు ఎత్తులో కట్టాడు పీటపై వస్తువులను పెట్టగానే గిరకను తిప్పమని ఆదేశిం చాడు. గిరక తిరిగి వస్తువు పైకి చేరుకోగానే గొడ్డలితో తాడును కత్తిరించమని పనివారికి చెప్పాడు. అప్పుడు పీట అమాంతం మళ్లీ యథాస్థానానికి చేరుకుంది. కానీ కింద పడిపోలేదు. ఇలా తొలి ప్రయోగమే ఆశాజనకంగా ఉండడంతో ఇదే ప్రయోగాన్ని మళ్లీ మళ్లీ చేస్తూ చివరకు విజయవంతం అయ్యాడు. పెద్ద పెద్ద బరువులను ఎత్తయిన ప్రదేశాలకు చేర్చడానికి అవస్థలు పడేవారికి ఉపశమనం కలిగిం చాడు.

శాస్త్రవేత్తగా మంచి గుర్తింపు సంపాదించిన అతడు తన టాలెంట్ ఏంటో తెలుసుకొని సంతోషించాడు. చిన్న ప్పుడు తనను అందరూ బద్దకస్తుడు అనేవారు. కానీ ఇప్పుడు అలాంటివారందరికీ ఉపయోగపడే లిఫ్టు కని పెట్టాడు . ఇలాంటివి ఇంకా చాలా కనిపెట్టి తన నైపుణ్యం ఏంటో నిరూపించుకోవాలి అనుకుంటున్న సమయంలో డిప్తీ రియా వ్యాధి సోకింది. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా నయం కాలేదు. పైగా అతడికి వ్యాధి కన్నా ఆవిష్కరణల పైనే దృష్టి ఎక్కువగా ఉండడంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినట్లు స్పష్టంగా కనిపించింది 1861 ఏప్రిల్ 8వ తేదీన న్యూయా లో తన కంపెనీలో చనిపోయాడు. ఇప్పుడు ఎలిసా ఓటిస్ లేడు. కానీ ఆయన రూపొందించిన ఎలివేటర్ మాత్రం మనకు నిత్యం ఉపయోగప డుతూనే ఉంది. ఇండ్లలో కంపె నీల్లో షాపింగ్ మాలో మెట్రో రైల్ స్టేషన్లలో ఇలా ఎక్కడంటే అక్కడ సేఫ్టీ ఎలివేటర్స్ కనిపిస్తుంటాయి కదా? వాటన్నింటనీ మనం వాడు తున్నాం కదా? అవన్నీ ఎలిసా ఓటిస్ ఆలోచనకు రూపాంతరాలే