దేశవాళీ క్రికెటర్ల ఖాతాలో డబ్బులు

గత సీజన్​లో కరోనా వల్ల దేశవాళీ క్రికెట్​ చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని నిర్వహించలేదు. మహిళల టీ20 టోర్నీ కూడా జరగలేదు. దీంతో చాలామంది క్రికెటర్లు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2019-20 సీజన్​లో పాల్గొన్న ఆటగాళ్లకు 2020-21కు సంబంధించిన మ్యాచ్​ ఫీజులో 50 శాతం.. కాంపెన్​సేషన్​గా(పరిహారం)​ ఇస్తామని గతేడాది సెప్టెంబరులో ప్రకటించింది బీసీసీఐ. ఇప్పుడు దానినే ఆటగాళ్లకు చెల్లించడం ప్రారంభించింది బోర్డు. గతేడాది సెప్టెంబరులో జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​లో సీనియర్​ ఆటగాళ్ల జీతాలను పెంచాలని బోర్డు నిర్ణయించింది. దీంతో ఒక రోజుకు పురుషులు రూ.40-60వేలు, మహిళలు రూ.20 వేలు అందుకుంటారు.