వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయిన కాళరాత్రి దివిసీమ ఉప్పెన

1977 నవంబర్ 19 దివిసీమను ఉప్పెన ముంచెత్తిన రోజు. హఠాత్తుగా సంభవించిన ఈ ఉపద్రవానికి ఒక్క దివిసీమ లోనే 15 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. లక్షల సంఖ్యలో పశుపక్షాదులు మరణించాయి. కుటుంబంలో తమ మనషులను పోగొట్టుకున్న వారి ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటాయి. మొత్తం కోస్తా తీరం వెంబడి ఉప్పెన ధాటికి 72 గ్రామాలకు పైగా నష్టపోయాయి . ఉప్పెన ధాటికి అధికారికంగా 30 వేల మంది ప్రాణాలు కోల్పోగా అనధికారికంగా 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేశారు. ఈ తల య బీభత్సానికి ఆ కాలంలోనే సుమారు వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తుఫాను ప్రభావంతో 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టే సాయి. ఎన్నడూ లేని విధంగా దివిసీమలో ఆ ఒక్క రోజే 450 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సముద్రపు అలలు 16 కిలోమీటర్లు ముందుకు చొచ్చుకు వచ్చి బీభత్సాన్ని సృష్టించాయి. ఈ ఉప్పెన మానవునిలో ఇంకా నిస్వార్థ సేవ మిగిలి ఉందని. ఇది ఇది మనిషిలోని ధైర్యం, దృడసంకల్పం, స్వార్ధ రాహిత్యం, సంఘ సేవ వంటి గుణాలను వెలికి తెచ్చింది. నవంబర్ 20 వ తేదీ నుండి సముద్రం నీరు వెనక్కి తిరిగి వెళ్లడంతో సహాయ కార్యక్రమాలు ప్రారంభించటం జరిగింది.

ఆనాటి మంత్రిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంకటరావు యుద్ధ ప్రాతిపదికన కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు అందించారు. జిల్లా యంత్రాంగం మొత్తం కదిలి వచ్చి బాధితులకు రేషన్ సామాన్లు, దుస్తులు నిత్యవసర వస్తువులు సరఫరా చేశారు.ఈ ఉప్పెన ధాటికి ఒక సోర్ల గొంది గ్రామంలోనే 714 మంది ప్రాణాలు కోల్పోగా దివిసీమ లోని మిగతా గ్రామాలైన దీనదయాళ్ పురం, దిండి, గణపేశ్వరం, ఎదురుమొండి, గుల్లలమోద, హంసలదీవి, పాలకాయతిప్ప, చింత కోళ్ల, ఇరాలి వంటి గ్రామాల్లో 15 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గుట్టలుగా పడి ఉన్న శవాలను పశు కళేబరాలను తొలగించే దు సహాయమైనా పనిని RSS, రామకృష్ణ మిషన్ కార్యకర్తలు చేపట్టారు. దేశం నలుమూలల నుండి ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

దివిసీమను ఆదుకునేందుకు ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, ఆనాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ, మదర్ థెరిస్సా, జర్మనీ స్వచ్ఛంద సేవకుడు బిల్లీ గ్రహం, ఆర్ ఎస్ ఎస్ అధినేత బాబాసాహెబ్ దేవరస్ వంటి గొప్ప గొప్ప వ్యక్తులు దివిసీమ ఉప్పెన ప్రాంతాన్ని సందర్శించి దివిసీమ ప్రజలకు అండగా నిలబడటం జరిగింది. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన దీనదయాళ్ గ్రామాన్ని ని ఆర్ఎస్ఎస్ దత్తత తీసుకుని ఆ నాటి విదేశాంగ శాఖ మంత్రి వాజ్పేయి చేతుల మీదగా గృహ నిర్మాణాలను ప్రారంభించడం జరిగింది. కూకటివేళ్లతో సహా తుడిచిపెట్టుకుపోయిన సొర్ల గొంది గ్రామాన్ని పోలీసు వారు దత్తత తీసుకుని అప్పటి ఐ జి నారాయణ రావు ఆధ్వర్యంలో గ్రామాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. వీడికి గుర్తుగా సొర్ల గొంది గ్రామంలో లో ఉప్పెన కు సంబంధించి సాయం చేస్తున్న పోలీస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.

ఇంతటి ఘోర ప్రళయానికి నేటికి 44 ఏళ్లు అయిన ఇంకా దివిసీమలో గ్రామాల అభివృద్ధి చాలా వెనుకబడి ఉంది నడవటానికి సరైన రహదారులు లేక విద్యార్థులకు సరైన హాస్టల్ సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం తమ గ్రామాలను అభివృద్ధి పరచాలని తుఫాన్ వస్తుంటే ఇప్పటికీ మా గుండెల్లో భయం కలుగుతుందని ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటి రోడ్డు కంటే ఉప్పెన సమయంలో ఉన్న ఇసుక దెబ్బలే నడవటానికి అనువుగా ఉండేవని ఇప్పటి రోడ్ల పరిస్థితి అంత దారుణంగా ఉందని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు.