చల్లపల్లి సీసీ కెమెరాల పనితీరు అభినందించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్.

చల్లపల్లి(కలం కౌంటర్)నూతనంగా కృష్ణజిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా బుధవారం అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లను సందర్శించిన జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశిల్. భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పోలీసువారు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. తొలుత చల్లపల్లిలో పోలీస్ స్టేషన్ నుంచే నిఘా నేత్రంతో అన్ని ప్రధాన కోడళ్ళు రహదారులు నిరంతరం పరిశీలిస్తూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పలురకాల సంఘ విద్రోహ నేరాలు హరికట్టే విధానం. విజిబుల్ పోలీసింగ్ గురించి ఎస్పీకి వివరించిన చల్లపల్లి ఎస్ఐ డి.సందీప్. రోడ్డు ప్రమాదాలు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అమర్చిన నిఘా నేత్రాల ఈ విషయంలో ఎస్ ఐ సందీప్ చర్యలను జిల్లా ఎస్పీ అభినందించారు. చల్లపల్లిలో దిశ యాప్ డౌన్లోడింగ్ విధానం వాటిని ప్రజలకు చేరువ చేయడం పై చల్లపల్లి సచివాలయ మహిళా పోలీసుల లావణ్య,ఇతర సచివాలయ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డిఎస్పీ ధర్మేంద్ర, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాషా, సిఐ జి.శ్రీనివాస్ ఉన్నారు