ఆసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 12 లక్షల విలువగల వైద్య పరికరాలు, వస్తువులు పంపిణీ

ఆసిస్ట్ సంస్థ ఆధ్వర్యంలో మూడు వైద్యశాలలకు రూ. 12 లక్షల విలువగల వైద్య పరికరాలను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు. స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆసిస్ట్ సంస్ధ డైరెక్టర్ జాస్తి రంగారావు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ద్వారా వీటిని వైద్యశాలలకు *అందించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ కోవిడ్ కేసులు తగ్గాయని ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించి వద్దని అన్నారు. ఈ ఏడాది అలా నిర్లక్ష్యంగా వ్యవహరించి జాగ్రత్తలు పాటించక పోవడం వల్లనే కేసులు, మరణాలు పెరిగినట్టు చెప్పారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్వాక్సిన్ వేయించుకోవడం, తగు జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాని కట్టడి చేయవచ్చన్నారు. *అవనిగడ్డలో ఏర్పాటు చేసిన 50 పడకల కోవిడ్ వైద్యశాలకు దాతలు అందించిన సహాయం మరువలేనిదన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అందించిన వైద్య సేవలు వల్ల ఎందరో ప్రాణాలను కాపాడ గలిగలిగామన్నారు. . అవనిగడ్డ వైద్య శాలకు అవసరమైన *పరికరాలను కొన్నింటిని సమకూర్చామని, మరికొన్నింటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాగాయలంక మండలంలోని ఎదురుమొండి దీవుల కేంద్రంగా ఆసిస్ట్ సంస్థ అందిస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు. కరోనా సమయంలో రూ. 12 లక్షలు విలువైన వైద్య *పరికరాలు అందించిన ఆసిస్ట్ సంస్ధకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆసిస్ట్ సంస్థ డైరెక్టర్ జాస్తి రంగారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు జిల్లాల్లోని 23 గ్రామాల్లో ఆసిస్ట్ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కరోనా సమయంలో 15,271 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1,000 విలువగల నిత్యావసర సరుకులు అందినట్లు చెప్పారు. ఈ ఏడాది ఐదు కార్యక్రమాల ద్వారా ఆయా గ్రామాల్లోని ప్రజలకు లబ్ధి చేకూరేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. అవనిగడ్డ, నాగాయలంక, అవనిగడ్డ సెయింట్ ఆన్స్ వైద్యశాలకు రూ. 12 లక్షల విలువగల వైద్య పరికరాలు, సామాగ్రిని అందించినట్లు రంగారావు తెలిపారు. ఆసిస్ట్ సంస్ధ డిప్యూటీ డైరెక్టర్ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ *కార్యక్రమంలో ఆశిస్తూ డైరెక్టర్ వియాని, ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ కృష్ణ దొర, నాగాయలంక,అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలల డాక్టర్లుజయసుధ, డాక్టర్ నాగలక్ష్మి, కువైట్ వైద్యశాల ప్రత్యేక అధికారిని వరలక్ష్మి, వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ నలుకుర్తి పృధ్వీ రాజ్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు *వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.