జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు అందజేయటం అభినందనీయం: మేయర్ గంగాడ సుజాత

ప్రాణాలకు తెగించి కరోనా కష్ట సమయంలో ప్రజల సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేయటంలో పోరాడుతున్న జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు అందజేయటం అభినందనీయమని మేయరు గంగాడ సుజాత అన్నారు. సూర్యశిరి దివ్యాంగుల చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌.ఐ. నారా హను కుమారుడు అనీష్ సాయి జన్మదినం సందర్భంగా వంద మంది జర్నలిస్టులు , కెమేరామెన్‌లకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేసే కార్యక్రమానికి మేయరు ముఖ్యఅతిధిగా హజారైన నిర్వాహకులను అభినందించారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్లు అయిన జర్నలిస్టులకు ఎంతచేసిన తక్కువేనని వారు చేసే సర్వీసు ముందు ఇది చాలా తక్కువన్నారు. చాలీచాలని వేతనాలతో సామాజిక దృక్పధంతో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మరో ముఖ్యఅతిధి సూర్యశిరి దివ్యాంగుల చారిటబుల్‌ ట్రస్టు ఫౌండర్‌ మండవ మురళీకృష్ణ, ఎ.పి.యు.డబ్ల్యు.జె.ఎఫ్‌ అధ్యక్షుడు గొట్టిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా నిరంతరం వార్త సేకరణలో అలుపెరగని కృషిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం ప్రశంసనీయమన్నారు. కార్యదర్శి బ్రహ్మం, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు, సిటీజన్‌ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, చైతన్య స్వరభారతి అధ్యక్షులు నూకతోటి శరత్‌బాబు, నాయక్‌, ట్రస్టు అధ్యక్షురాలు షహనాజ్‌, ఎస్‌.కె.సర్దార్‌, గొల్లపూడి రవి, బొడ్డపాటి వెంకట్‌, నేరెళ్ళ శ్రీనివాసరావు, ఎన్‌.శ్రీకాంత్‌, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.