కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన దినేశ్‌ కార్తీక్‌

కేకేఆర్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించాడు దినేష్ కార్తిక్.ఈ మేరకు శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బ్యాటింగ్‌పై ఫోక‌స్ పెట్టాల‌న్న దృష్టితో సార‌థ్యాన్ని వ‌ద‌లుచుకుంటున్న‌ట్లు దినేశ్ వెల్ల‌డించాడు.ఇక నుంచి ఆ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గన్ చూసుకోనున్నాడు.దినేశ్ కార్తీక్ నిర్ణయం పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు.తనకు తానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం అవసరమన్నారు. దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని కానీ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు దినేశ్‌ కార్తీక్‌ లాంటి నాయకుడు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు.ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి.జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు ,నరైన్‌కు ఓపెనర్‌గా పదే పదే అవకాశాలు ఇవ్వడం పట్ల తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడం వలన విమర్శలు ఎదుర్కొన్నాడు.