తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి

కడప జిల్లా చిట్వేలు మండలం తిమ్మయ్య గారి పల్లి దళితవాడ హెడ్ కోటర్ లో 153a సర్వే నెంబర్లు సచివాలయం కట్టాలని కలెక్టర్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఒత్తిడితో సచివాలయం కట్టకుండా రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ ఆఫీస్ వద్ద దళితులు ధర్నా నిర్వహించడం జరిగింది అగ్రవర్ణాలు చి ల్ల వాండ్ల పల్లెలో కట్టాలని అధికారులు గ్రామసభ పెట్టకుండా పెట్టినట్లు తప్పుడు రిపోర్టులు ఇచ్చిన పంచాయతీ సెక్రెటరీ ఎం ఈ ఓ స్పెషల్ ఆఫీసర్ ఎం డి ఓ లను తక్షణం సస్పెండ్ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సి హెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

విచారణ కమిటీ విచారించి అధికారులు తప్పుడు రిపోర్టు ఇచ్చింది వాస్తవమని నిర్ధారించి డి పి ఓ కి డి ఎల్ పి ఓ నివేదిక పంపి రెండు నెలలు అయినా ఎందుకు చర్య తీసుకోలేదు చెప్పాలని అని డిమాండ్ చేశారు తక్షణము సచివాలయం పనులు ప్రారంభించాలని అవినీతి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు అనంతరం కడప డి ఆర్ ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఆయన స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ డివిజన్ కన్వీనర్ ఓ బి లి పెంచలయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ చెన్నయ్య కార్యదర్శి పంది కాళ్ల మణి బొజ్జ శివయ్య సిఐటియు నాయకులు దార్ల నాగేశ్వరరావు చిట్టి వేలు సిఐటియు నాయకులు రమేష్ రెడ్డి ఆటో యూనియన్ నాయకుడు చిన్న. వెంకటయ్య. డివైఎఫ్ఐ నాయకులు కర్ర తోటి హరి నారాయణ మరియు తిమ్మయ్య గారి పల్లి దళితులు తదితరులు పాల్గొన్నారు.