ధనుష్‌ బర్త్‌డే స్పెషల్ – సార్‌ ద్విభాషా చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదల

ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘సార్‌’ (తమిళంలో ‘వాత్తి’). ఇందులో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్, శ్రీకర స్టూడియోస్‌లతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 28 ధనుష్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా  ‘సార్‌’  సినిమాలో ధనుష్‌ ఫస్ట్‌లుక్‌ను బుధవారం చిత్రయూనిట్‌ విడుదల చేసింది. నేడు . ధనుష్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ మర్చిపోలేనిది  వెంకీ అట్లూరి అన్నారు. అక్టోబరులో సినిమాను విడుదల చేస్తాం అన్నారు నాగవంశీ.