భారత్ బయోటెక్‌ మూడవ దశ ట్రైల్స్ కు DGCA అనుమతి

దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ కరోనా నివారణ కోసం తయారుచేస్తున్న కోవ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DGCI) గురువారం(అక్టోబర్ 22) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడో దశ ప్రయోగాల కోసం అక్టోబర్ 2న భారత్ బయోటెక్ దరఖాస్తు చేసుకోగా తాజాగా అందుకు అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు నవంబర్ మొదటివారంలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

22వేల మంది వాలంటీర్లపై…
మూడో దశ ప్రయోగాల కోసం దేశవ్యాప్తంగా 18-19 నగరాల్లో ఇప్పటికే 22వేల పైచిలుకు మంది వాలంటీర్లను భారత్ బయోటెక్ ఎంపిక చేసుకుంది. ఇందులో ఢిల్లీ,ముంబై,పాట్నా,లక్నో వంటి ప్రధాన నగరాలు కూడా ఉన్నాయి. మూడో దశ ప్రయోగాలు కూడా విజయవంతంగా త్వరగా పూర్తయితే… సమీప భవిష్యత్తులోనే భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.