9 నిమిషాలు 9 దీపాలు వెలిగించిన ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.

తూర్పు గోదావరి జిల్లా:
రామచంద్రపురం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, అరికట్టేందుకు, లాక్ డౌన్ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రామచంద్రపురం వైఎస్ఆర్సిపి క్యాంపు కార్యాలయం వద్ద 9 గంటలకు, 9 నిమిషాలు 9 దీపాలు వెలిగించిన ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ
మేమున్నామంటూ రేయనక పగలనక తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు, పోలీసులకు, వైద్యులకు, జనం దీపాలతో నీరాజనం పట్టారు.

విపత్తు వేళ తమ కుటుంబాలను వదిలి తమ ఆరోగ్యాన్ని దార పోస్తూ మీ త్యాగఫలం మరువలేనిది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నేను సైతం అంటూ రామచంద్రపురం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు పారిశుద్ధ్య వైద్యులకు కృతజ్ఞతా భావంతో దీపం వెలిగించి వారి సేవలను కొనియాడారు అలాగే నియోజకవర్గంలో గ్రామ గ్రామాన వీధివీధిలో జనం దీప నీరాజనం పట్టారు.