పంజాబ్ లో దీప్ సిద్దూను అరెస్టు చేసిన ఢిల్లీ స్పెష‌ల్ సెల్ పోలీసులు..

గణతంత్ర దినోత్సవం రోజున రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న రైతుల‌ను, సానుభూతిప‌రును ప్ర‌భావితం చేసి ఎర్ర‌కోట‌వైపు మ‌ళ్లించాడ‌న్న కారణంతో నటుడు దీప్ సిద్దూపై పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదు చేశారు. అప్పటినుండి ఆయన పరారీలో ఉండటంతో.. దీప్ సిద్దూ ఆచూకీ తెలిపిన వారికి ల‌క్ష రూపాయ‌ల న‌జ‌రానా ఇస్తామ‌ని పోలీస్ శాఖ వెల్లండింది. జ‌న‌వ‌రి 26నుండి ప‌రారీలోనే ఉన్న సిద్దు ను ఢిల్లో పోలీసులు పంజాబ్ లో ఢిల్లీ స్పెష‌ల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.