కరోనా నుంచి కోలుకున్న కేజ్రీవాల్‌

కరోనాబారినపడ్డ అరవింద్ కేజ్రీవాల్ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ నెల 4న ఆయనకు వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లారు. స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి వైరస్‌ను జయించారు.