క్రిటికల్‌గా తారకరత్న ఆరోగ్య పరిస్థితి
శుక్రవారం లోకేష్ పాదయాత్రలో బాలకృష్ణతో కలిసి పాల్గొన్న తారకరత్న స్పృహ కోల్పోయిన తారకరత్నకు చికిత్స జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం మధ్యాహ్నం ఆయన హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు నారాయణ హృదయాలయ వైద్యులు. తారకరత్న ఆరోగ్యం ఇంకా క్రిటికల్‌గా నే ఉందని.. ప్రస్తుతం ఆయనను నిపుణుల బృందం పర్వవేక్షిస్తున్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు వైద్యులు. మరికొన్ని రోజులు చికిత్స అందించాలని తెలిపారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పది మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తుందని తెలిపారు డాక్టర్స్. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి అటు అభిమానులు.. టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు. ఇక అర్ధరాత్రి ఆయనను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.