మరియమ్మ లాక్‌అప్ డెత్ లో బాధ్యులపై సీపీ చర్యలు

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్‌అప్ డెత్ కేసులో బాధ్యులపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను తమ సర్వీసు నుండి సీపీ తొలగించారు. అడ్డగుడూరు పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో మరియమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎస్ఐ మహేశ్వర్, కానిస్టేబుళ్లు రషీద్ పటేల్, జనయ్యలను సర్వీసు నుంచి తొలగిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఆర్టికల్ 311 (2) బి 25 (2) ప్రకారం బాధ్యులను సీపీ సర్వీసు నుండి తొలగించారు.