ఇటలీలో రెండు లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య..!

ప్రపంచంలోని అన్ని దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది ఇప్పటిదాకా దాదాపు 210 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించింది… దాంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి దాకా 31,38,919 మందికి వ్యాపించింది, వారిలో 2,18,010 మంది మృతి చెందారు…! అలాగే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య లో రెండు లక్షలు దాటిన దేశంగా ఇటలీ 3వ స్థానంలో నిలిచింది..! నిన్న నమోదైన 2,091 కొత్త కరోనా పాజిటివ్ కేసులతో, ఇటలీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలు దాటి 2,01,505 కి చేరింది..! వారిలో ఇప్పుడు దాకా 27,359 మంది మృతి చెందగా, నిన్న ఒక్కరోజే 382 మంది మృతి చెందారు..! అలాగే ఈ దేశంలో ఇప్పటిదాకా 68,941 మంది కరోనా బారినుంచి విముక్తి పొందారు..!