కోరలు చాస్తున్న కరోన కేసులు… నెల్లూరుజిల్లాలో కొత్తగా 669 మందికి పాజిటివ్

నెల్లూరుజిల్లా కరోనా వైరస్ జోరు తగ్గడం లేదు. ప్రతీ రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే 16వేల కేసులు దాటేశాయి. తాజాగా ఇవాళ కొత్తగా మరో 669 పాజిటివ్ కేసులునమోదైనాయి. నిన్నటి వరకూ కేసుల సంఖ్య 16వేలా 19 గా ఉండగా తాజా కేసులతో కలిసి మొత్తం కేసుల సంఖ్య 16వేల 688 కి చేరిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. గడచిన 24 గంటల్లో కోవిడ్ వైరస్ కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారని, 906 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. జిల్లాలో మొత్తం యాక్టివ్ కేసులు 5720 ఉన్నాయని, మొత్తం డిశ్చార్జ్ ల సంఖ్య 10వేలా 968 అని పేర్కొన్నారు. ఇక పోతే జిల్లాలోని కోవిడ్ హాస్పిటల్స్ లో 1440 ఆక్సిజన్ బెడ్స్, కోవిడ్ కేర్ సెంటర్లలో 1073 నాన్ ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు ప్రకటించారు.