ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం కేసీఆర్ వెయిటింగ్

ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్‌ కోసం సీఎం కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులను సీఎం కేసీఆర్‌ కలవనున్నారు. సాయంత్రం పీయూష్ గోయల్‌తో మంత్రులు సమావేశంకానున్నారు. ధాన్యం సేకరణ సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.