సింగరేణి కార్మికులకు తీపి కబురు.

హైదరాబాద్‌: బొగ్గుగన్నుల్లో పనిచేసే సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం 43,899 మంది సింగరేణి ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. పదవీ విరమణ అమలు తేదీపై ఈ నెల 26న బోర్డు భేటీలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు బోర్డు భేటీ నిర్ణయం ప్రకటించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రామగుండంలో సింగరేణి వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.