సీఎం జగన్ కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. జగన్, విజయసాయి ఇద్దరి బెయిల్ పిటిషన్లను రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్లు వేశారు.

ఈ పిటిషన్లపై జులై ఆఖరులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును రిజర్వ్ లో ఉంచిన కోర్టు… ఈరోజు తీర్పును వెలువరించింది. రఘురాజు పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో, గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన అంశానికి ముగింపు కార్డు పడింది. సీబీఐ కోర్టు తీర్పుతో వైసీపీ శిబిరంలో సంతోషకర వాతావరణం నెలకొంది.