ఖాకీ చొక్కాకు కరుణతత్వం

ఖాకీ చొక్కా అంటేనే భయపడతాం….కానీ ఆ చొక్కా ధరించిన గుండెకు కూడా కరుణతత్వం ఉంటుందని నిరూపిస్తున్నారు అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవికుమార్. ఆపదలో కష్టమని తన దగ్గరకు వచ్చిన ఎవరికైనా చేతనైన సాయం అందించే మానవత్వం ఆయనకే సొంతం. ఇటీవల జర్నలిస్టు మిత్రుడు మృతి చెందితే కుటుంబానికి సాయం అందించి తన ఉదారతను చాటుకున్న మంచి మనిషి. ఇదే కాదు కష్టంలో ఉన్నాము అంటే జాలి చూపే మంచి మనస్సు ఆయనది.

వృద్ధాశ్రమానికి నిత్యావసరాల పంపిణీ :-
రేపల్లె మండలం ఆలపార్రు గ్రామంలోని చేయూత వృద్ధాశ్రమాన్ని 70 సంవత్సరాలు పైబడిన అలపర్తి సాంబయ్య దంపతులు నిర్వహిస్తున్నారు. నిస్వార్ధంగా సేవ చేస్తున్న వారికి తనవంతు చేయూతను సీఐ అందజేశారు. వృద్దశ్రమానికి నిత్యావసర వస్తువులు, బియ్యం, కొంత నగదును అవనిగడ్డకు చెందిన వనజ మెస్ ఓనర్ ఆళ్ళ శ్రీనివాస్, సామర్ల మల్లికార్జునరావు ద్వారా వృద్ధాశ్రమానికి అందజేశారు. కరోనా కష్టకాలంలో వృద్ధులు ఆకలితో అలమటించే కూడదని సిఐ చేసిన సహాయానికి వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు.