తెలుగు రాష్ట్రాల్లో త్వరలో చిరంజీవి అంబులెన్స్ సర్వీసులు.

క‌రోనా క‌ష్ట‌కాలంలో సహృదయంతో ముందుకు వచ్చి ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా అంబులెన్స్ సేవలను తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారని వార్తలు వినవస్తున్నాయి. కరోనా ఆపద కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని తెలుసుకున్న వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేశారు.. మ‌రోవైపు సినీ కార్మికులకు తన ట్రస్ట్ ద్వారా వ్యాక్సినేషన్ కూడా ఆరంభించారు. వీలైనంత త్వ‌ర‌గా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాల‌ని చిరంజీవి అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.