సీఎం జగన్ తో ముగిసన చిరంజీవి సమావేశం

సీఎం జగన్‌తో మెగాస్టార్‌ భేటీ ముగిసింది. గంటన్నర పాటు సీఎం జగన్‌తో చిరంజీవి చర్చించారు. ఇండస్ట్రీ సమస్యలను మెగాస్టార్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. భేటీ అనంతరం కూడా ట్విస్ట్‌ కొనసాగుతోంది. మరోసారి సీఎం జగన్‌తో తమ టీంతో వచ్చిన చర్చిస్తామని చిరంజీవి చెబుతున్నారు. చిరంజీవి చెప్పిన వివరాలను ముఖ్యమంత్రి జగన్ నోటు చేసుకున్నారు. మొత్తానికి మరో మీటింగ్‌తో సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.