బ్రహ్మాస్త్ర కోసం వాయిస్‌ ఓవర్‌ అందించిన మెగాస్టార్

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌ చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రంగా రిలీజ్‌ కానుంది.  అయాన్‌ ముఖర్జీ ఈ మూవీని రూపొందించాడు. ఇటీవలే టీజర్‌తో పాటు నటీనటుల లుక్స్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ తాజాగా ఓ స్పెషల్‌ వీడియో  రిలీజ్‌ ఇందులో చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్‌కు వాయిస్‌ అందించారూ. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు. ట్రైలర్‌ చూడాలంటే మాత్రం జూన్‌ 15 వరకు ఆగాల్సింద, ఈ చిత్రంలో ప్రొఫెసర్‌ అరవింద్‌ చతుర్వేది పాత్రను అమితాబ్‌ బచ్చన్‌ పోషిస్తుండగా. అనీష్‌ శెట్టి పాత్రలో నాగార్జున కనిపించనున్నారూ.