కవల పిల్లలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి శ్రీపాద
ప్లే బ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయికి తనదైన గుర్తింపుతెచ్చుకున్న సింగర్ చిన్మయి శ్రీపాద హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను ప్రేమించిపెళ్లి చేసుకున్నా చిన్మయి శ్రీపాద మంగళవారం కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు. పిల్లలకు సంబంధించిన చేతులు వారి చేతులను ఆమె, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ పట్టుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఇద్దరి పిల్లల్లో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు ఆమె తెలియజేసింది. చిన్మయి – రాహుల్ రవీంద్రకు న్నెటిజన్స్, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.