పెడన మండల పార్టీ మహిళా అధ్యక్షురాలిగా చెన్నూరు ఎంపీటీసీ కాటం నాగమణి నియామకం

పెడన శాసనసభ్యులు  జోగి రమేష్ మండల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న మీదట . ఈ మేరకు ఈ రోజు పెడన మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన 2వ వైస్ ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శ్రీ జోగి రమేష్ గారు ఒక ప్రకటన విడుదల చేశారు.పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శ్రీమతి కాటం నాగమణి గారి శ్రమను గుర్తించి గతంలో ఎమ్మెల్యే గౌరవ శ్రీ జోగి రమేష్ గారు ఎంపీటీసీ గా అవకాశం కల్పించిన సంగతి తెల్సిందే.. ఈ రోజు మండల మహిళా పార్టీ అధ్యక్షురాలిగా ఆమెను నియమించడం ఆవిడ శక్తి సామర్ధ్యాలకు నిదర్శనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి గరికపాటి చారుమతి రామానాయుడు దంపతులు,ఎంపీపీ శ్రీ రాజులపాటి వాణి అచ్యుతరావు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ కొండవీటి నాగబాబు,రాజేష్ మరియు మండల నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.