ఐపిఎల్ 14: ఢిల్లీకి భారీ టార్గెట్ నిర్దేశించిన చెన్నై

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో భాగంగా ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ లో 20 ఓవర్లకు గానూ 189 విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోవడంతో ఒకదశలో జట్టు ఇంత భారీ స్కోరు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఈ దశలో సురేశ్‌ రైనా (54) భారీ షాట్లతో అర్ధశతకం పూర్తిచేసుకోవడంతో రైనా కు తోడుగా మరో ఎండ్ లో మొయిన్‌ అలీ(36) పరుగులు చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆతరువాత వచ్చిన శామ్‌ కరన్‌(34), అంబటి రాయుడు (23) రవీంద్ర జడేజా (26) పరుగులు చేయడంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌, క్రిస్‌ వోక్స్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ నాలుగు ఓవర్లు వేసి వికెట్‌ తీసుకున్నాడు.