రాజభవన్ ముట్టడికి వెళుతున్న కాంగ్రేస్ నాయకులు

ఈరోజు అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం ములకలపల్లి లో ఏ.ఐ.సి.సి.అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ & టి.పి.సి.సి.అధ్యక్షుడు శ్రీ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ములకలపల్లి మండలం నుంచి హైదరాబాద్ లోని రాజభవన్ ముట్టడికి వెళుతున్న కాంగ్రేస్ నాయకులు & ప్రజాప్రతినిధులను ముల్కలపల్లి ఎస్.ఐ .సురేష్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారు . అనంతరం సున్నం నాగమణి Z. P.T.C. ములకలపల్లి & టి పి సి సి మహిళ కాంగ్రేస్ జనరల్ సెక్రటరి మాట్లడుతూ మోడీ & కె.సి.ఆర్.చేయిస్తున్న అక్రమ గూడచర్యానికి ( ఫోన్ స్లీపింగ్) వ్యతిరేకంగా రాజ్ భవన్ ముట్టడికి వెళ్లకుండా అడ్డుకోవడం సరైన చర్య కాదని ఆందోళన చేసినాము. అక్రమ అరెస్టులతో కాంగ్రేస్ శ్రేణులను ఆపలేరని సున్నం నాగమణి తెలియపరుస్తున్నాను.

ఈ కార్యక్రమము లో పాల్గొన్న తాండ్ర ప్రభాకర్ రావు మండల కాంగ్రేస్ సీనియర్ నాయకుడు, ఎం.డి.అంజుమ్ మండల మైనారటీ ప్రెసిడెంట్, పుష్పాల హనుమంతు మండల ఓ బీ సి ప్రెసిడెంట్, బుగ్గారపు సత్యనారాయణ , కోండ్రు రవి, భానోతు విష్ణుభగవన్ మండల కాంగ్రేస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.