కామూరి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ప్రకాశం జిల్లా కొమరోలు పట్టణంలోని ఆంజనేయ స్వామి నాలుగు రోడ్ల కూడలి వద్ద వైసీపీకి నాయకులు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు.ఈ చలివేంద్రాన్ని కొమరోలు ఎస్ఐ సాంబ శివయ్య చేతుల మీదగా ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన రమణారెడ్డిని ఎస్ఐ సాంబ శివయ్య అభినందించారు.ఈ కార్యక్రమంలో కామూరి రమణారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.