జనసేన పార్టీ ఆధ్వర్యంలో తదేకం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ నేర్చుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ అందజేత

కాకినాడ : పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో తదేకం ఫౌండేషన్ తోడ్పాటుతో జనసేనపార్టీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ మహిళా కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సాధికారతలో భాగంగా నిర్వహిస్తున్న కుట్టు శిక్షణా కేంద్రాన్ని తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి , సుధా పర్యవేక్షించడం జరిగింది. గత నాలుగు నెలల నుండి సుమారు 150 మంది మహిళలు శిక్షణ పొందడం జరిగింది. అందరూ చాలా నైపుణ్యంతో శిక్షణ పొందుతున్నారని మహిళల స్వయం ఉపాధికి ఉపయోగపడేలా శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్న చల్లా లక్ష్మి అభినందనీయులని తదేకం ఫౌండేషన్ ప్రతినిదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కుట్టుశిక్షణా కేంద్రంతో బాటు పలు సేవా కార్యక్రమములకు తోడ్పాటునందిస్తున్న తదేకం ఫౌండేషన్ ప్రతినిధులకు జనసేనపార్టీ తరుపున చల్లా లక్ష్మి కృతజ్ఞతలు తెలియజేసారు. తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు మాధవిని, సుధాని, కుట్టు శిక్షణ టీచర్ శ్రీలక్ష్మి మరియు శిక్షణ పొందుతున్న మహిళలు ఘనంగా సత్కరించడం జరిగింది. ఈకార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ స్థానిక ప్రతినిది బీడీల రాజబాబు పలువురు జనసేనపార్టీ నాయకులు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.