2023 సంవత్సరానికి గ్యాలంటరీ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం  2023 సంవత్సరానికి గ్యాలంటరీ అవార్డులను  ప్రకటించింది. ఈ సంవత్సరం ఆరుగురికి కీర్తిచక్ర, 15 మందికి శౌర్యచక్ర, 412 మందికి గ్యాలంటరీ అవార్డులతో సత్కరిస్తారు. మేజర్ శుభాంగ్ , నాయక్ జితేంద్ర సింగ్‌లకు కీర్తి చక్ర ప్రదానం చేస్తారు. మేజర్ ఆదిత్య భడోరియా, కెప్టెన్ అరుణ్ కుమార్, కెప్టెన్ యుధ్వీర్ సింగ్, కెప్టెన్ రాకేష్ టిఆర్, (మరణానంతరం) నాయక్ జస్బీర్ సింగ్ , లాన్స్ నాయక్ వికాస్ చౌదరి, కానిస్టేబుల్ ముదాసిర్ అహ్మద్ షేక్ (మరణానంతరం) శౌర్య చక్ర పొందుతారు. అశోక్‌ చక్ర తర్వాత రెండో అత్యున్నత పీస్‌టైమ్‌ గ్యాలంటరీ పురష్కారం  కీర్తిచక్ర.రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భం గా 412 మంది సాయుధ దళాల సిబ్బందికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు, ఇతర గౌరవాలను అందజేయనున్నారు.