ఘనంగా ఎలక్ట్రిషియన్స్ డే వేడుకలు .
నందిగామ పట్టణంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం ఆవరణలో ఎలక్ట్రీషియన్స్ డే సందర్భంగా యూనియన్ పతాకాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆవిష్కరించారు. ముందుగా థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంతో పాటు కుల మతాలు పార్టీలకు అతీతంగా అర్హులందరికీ అందించేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిషన్ పడుతున్న ఇబ్బందులు -సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.అనంతరం పలు సమస్యలపై ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు .. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని యూనియన్ సభ్యులు ఘనంగా సత్కరించారు ..ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, పి పి రంగా, కార్పొరేషన్ డైరెక్టర్ వీసం దుర్గారావు, కౌన్సిలర్లు మారం అమరయ్య, పాకాలపాటి కిరణ్, గద్దె శేషు కుమారి, యూనియన్ అధ్యక్షులు ఇంటిమాల ఆనంద్, సభ్యులు షేక్ కరీముల్లా, యార్లగడ్డ కిషోర్, కనగాల సురేష్ తదితరులు పాల్గొన్నారు .