తల్లిపాల వారోత్సవాలు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల : పిల్ల తల్లులు పౌష్టికాహారం తీసుకోవాలని సర్పంచ్ మన్నె సాత్విక సూచించారు. కంచికచర్ల మండల పరిధిలోని పేరకలపాడు గ్రామంలో అంగన్వాడి 1 సెంటర్ నందు శుక్రవారం అంగన్వాడి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ మన్నె సాత్విక మాట్లాడుతూ పిల్ల తల్లులు అప్పుడే పుట్టిన బిడ్డలకు తల్లి నుండి వచ్చే మురిపాలను ఆరు నెలల పాటు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యం గా ఉంటారని బిడ్డలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, పిల్ల తల్లులు పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం, ఆశ వర్కర్, పిల్ల తల్లులు పాల్గొన్నారు.