గడప గడపలో సంక్షేమ వెలుగులు, జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి : ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరు :నియోజకవర్గ నందవరం మండల పరిధిలోని పెద్ద కొత్తిలి గ్రామ పంచాయతీలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” ప్రతి గడప గడపకు వెళ్తూ జగనన్న ప్రభుత్వం ప్రతి ఇంటికి అందించి నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందకపోతే తన దృష్టికి తీసుకొని వస్తే కచ్చితంగా పరిష్కరించే విధంగా ముందడుగు వేస్తానని అక్కడి ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఎర్రకోట జగనన్న. పెద్ద కొత్తిలి గ్రామ పంచాయతీ లో నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలతో ప్రజల జీవన ప్రమాణాలలో పూర్తిగా మార్పు వచ్చిందన్నారు.
జీవన విధానం మెరుగు పడడంతో పాటు పేదలు సైతం సంతోషంగా ఉన్నారన్నారు. ఉచిత పంటల బీమా, ఆసరా పథకాలు, ఆరోగ్య శ్రీ, అమ్మ ఒడి, విద్యాదీవెన, పెన్షన్ కానుక, రైతు భరోసా, పగటి పూట వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ తదితర పథకాలు రైతులు, పేదలకు వరంగా మారాయన్నారు. జగనన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటు న్నాయన్నారు. సంక్షేమ ఫలాలు ఇలానే కొనసాగాలంటే ప్రజలు మరోమారు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు.ఈ కార్యక్రమం లో పెద్ద కొత్తిలి సర్పంచ్ బి. శివన్న, మండల కన్వీనర్ శివరెడ్డి గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, మాజీ సర్పంచ్ సురేష్ గౌడ్, ముగతి సర్పంచ్ బిసి సెల్ అధ్యక్షులు వీరుపాక్షి రెడ్డి, రాముడు, నరసింహులు, వెంకట్ రెడ్డి, నగేష్, శ్రీను నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, గ్రామ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.